APPSC FSO Recruitment 2025
APPSC: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల – డిగ్రీ అర్హతతో 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 సంవత్సరానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి సంబంధించి 100 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూలై 28, 2025 నుంచి ప్రారంభమై ఆగస్టు 17, 2025 వరకు కొనసాగుతుంది.
ప్రతిష్టాత్మక సంస్థ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
పోస్ట్ పేరు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO)
భర్తీ విధానం: నేరుగా నియామకం
దరఖాస్తు విధానం: ఆన్లైన్
అభ్యర్థులు కింది కోర్సులలో ఏదైనా ఒక డిగ్రీ కలిగి ఉండాలి:
సైన్స్ సబ్జెక్టులు: బోటనీ, జూలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ
ఇతర సబ్జెక్టులు: ఫారెస్ట్రీ, హార్టికల్చర్, అగ్రికల్చర్
ఇంజినీరింగ్ డిగ్రీలు: కెమికల్, సివిల్, మెకానికల్
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్ఠం: 30 సంవత్సరాలు (01.07.2025 నాటికి)
(రాజ్యాంగ రిజర్వేషన్ల మేరకు వయస్సు సడలింపు వర్తిస్తుంది)
పురుషులు
కనీస హైట్: 163 సెం.మీ
ఛాతీ: 84 సెం.మీ (5 సెం.మీ విస్తరణతో)
మహిళలు
కనీస హైట్: 150 సెం.మీ
ఛాతీ: 79 సెం.మీ (5 సెం.మీ విస్తరణతో)
పురుషులు: 25 కి.మీ – 4 గంటలలోపు
మహిళలు: 16 కి.మీ – 4 గంటలలోపు
స్క్రీనింగ్ టెస్ట్ (OMR విధానం) – సెప్టెంబర్ 7, 2025
ముఖ్య పరీక్ష (Main Exam) – త్వరలో తేదీ ప్రకటిస్తారు
కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)
NCC సర్టిఫికేట్ ఉన్నవారికి బోనస్ మార్కులు వర్తించవచ్చు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 28.07.2025
దరఖాస్తు చివరి తేదీ: 17.08.2025
స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 07.09.2025
ముఖ్య పరీక్ష & ఫిజికల్ టెస్ట్ తేదీలు: త్వరలో ప్రకటించబడతాయి