Breaking News:
Entertainment

Ravanasura OTT: ‘రావణాసుర’ OTT స్ట్రీమింగ్.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నిశ్శబ్ద ప్రవేశం!

Ravanasura OTT: ‘రావణాసుర’ OTT స్ట్రీమింగ్

Ravanasura: మాస్ మహారాజా రవితేజ, అక్కినేని యంగ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రావణాసుర’ (Ravanasura) చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేయగా.. ఏప్రిల్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఇంతలో, రావణాసుర చిత్రం థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది.

 

ప్రస్తుతం, ‘రావణాసుర’ (Ravanasura) తన డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేస్తోంది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ ఆడియోలలో అందుబాటులో ఉండగా, వినియోగదారులు ఆంగ్ల ఉపశీర్షికలతో చూడవచ్చు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీలోకి ‘రావణాసురుడు’ (Ravanasura) ఎంట్రీ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

 

ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ అందించగా, హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షనాగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా కనిపించగా.. శ్రీరామ్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 

కాగా, రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నటిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు మరియు నూపుర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. అక్టోబరు 20న విడుదల కానుంది.ఈ సినిమాతో పాటు రవితేజ ఇప్పటికే ‘డేగ’ షూటింగ్‌ను ప్రారంభించాడు.

Trending News