Naga Chaitanya Vrushakarma : నాగ చైతన్య నటిస్తున్న NC24 సినిమాకు ‘వృషకర్మ’ అనే అధికారిక టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ మరియు పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో నాగ చైతన్య ఒక పూర్వీకుల భవనం ముందు ఆయుధంతో నిలబడి కనిపిస్తారు.
దాదాపు శిథిల స్థితిలో ఉన్న ఈ ఇంటి బ్యాక్‌డ్రాప్ సినిమాలో ఉండబోయే ఫాంటసీ – పౌరాణిక థ్రిల్లర్ టోన్ కు నిదర్శనంగా కనిపిస్తోంది.
విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో:
నాగ చైతన్య
మీనాక్షి చౌదరి (దక్ష పాత్రలో)
స్పర్శ్ శ్రీవాస్తవ (తెలుగులో తొలి సినిమా)
ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన మీనాక్షి పోస్టర్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. నాగ చైతన్య – మీనాక్షి చౌదరి జోడి ఇది మొదటిసారి కలసి నటించటం విశేషం.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై BVSN ప్రసాద్ మరియు సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు.
సుకుమార్ స్వయంగా స్క్రీన్‌ప్లే అందించటం కూడా ఈ సినిమాపై హైప్ పెంచుతోంది.
సాంకేతిక బృందం:
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
సినీ చాయాగ్రహణం: రఘుల్ ధరుమాన్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటింగ్: నవీన్ నూలి
ఇటీవల విడుదల చేసిన BTS వీడియో అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
అయితే, వృషకర్మ విడుదల తేదీని చిత్రబృందం త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.
వృషకర్మపై మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!
