Breaking News:
Politics

Chandrababu and Pawan Kalyan same thinking:ప్రజల కోసం కలిసి పనిచేస్తాం.

చంద్రబాబు: “నేను, పవన్ కళ్యాణ్ ఒకేలా ఆలోచిస్తాం… ప్రజల కోసం కలిసి పనిచేస్తాం”

 

Chandrababu and Pawan Kalyan same thinking: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తాను ఒకేలా ఆలోచిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడంలో ఈ ఇద్దరి అవగాహన NDA ప్రభుత్వ భాగస్వామ్యానికి బలమని తెలిపారు.

 

ఏలూరులోని గోపీనాథపట్నం పర్యటనలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు.

 

పెన్షన్‌ పెంపు – దేశంలోనే అత్యధిక ఖర్చు APలోనే

 

AP ప్రభుత్వం పెన్షన్ల కోసం భారీగా రూ.33 కోట్లు వెచ్చిస్తున్నదని చంద్రబాబు పేర్కొన్నారు

 

ప్రతి 100 మందిలో 13 మంది పెన్షనర్లు

 

వారిలో 59% మహిళలు

 

పెన్షన్‌ను ₹4000గా పెంచినట్లు తెలిపారు

 

“గత జగన్ ప్రభుత్వం కేవలం ₹250 మాత్రమే పెంచింది” అని విమర్శించారు

 

ఒక మహిళా లబ్ధిదారుకి స్వయంగా పెన్షన్ అందజేశారు కూడా.

 

రైతులకు బకాయిల చెల్లింపు – 4 గంటల్లో డబ్బులు ఖాతాలోకి

 

గత ప్రభుత్వం రైతులకు రూ.1650 కోట్లు బకాయిలు వదిలి వెళ్ళిందని చెప్పారు.

తాను బాధ్యతలు తీసుకున్న వెంటనే:

 

బకాయిలను పూర్తిగా క్లియర్ చేశారు

 

ధాన్యం అమ్మకాల తర్వాత 4 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చేస్తామని తెలిపారు

 

మహిళలకే ప్రాధాన్యం – ఉచిత బస్సుల్లో 25 కోట్ల ప్రయాణాలు

 

25 కోట్ల మహిళలు ఉచిత బస్సు సేవలను వినియోగించుకున్నారని

 

ప్రభుత్వం దీనికోసం రూ.550 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు వెల్లడించారు

 

భవిష్యత్‌లో లక్ష్యం – ఉద్యోగాలు & గ్రామ ఆదాయం

 

యంత్రాల వలన ఉద్యోగాలు తగ్గే ప్రమాదాన్ని నివారించాలంటే:

 

జనాభా పెరిగేలా చూడాలి

ప్రతి గ్రామానికి ఆదాయం వచ్చేలా ప్రాజెక్టులు అమలు చేయాలి

 

చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

అధికారులకు:

 

స్పష్టతతో

 

క్రమశిక్షణతో

 

ప్రజల పట్ల నిబద్ధతతో

 

పని చేయాలని సూచించారు.

Trending News