Breaking News:
Entertainment

Chiranjeevi Shashirekha song: స్టైల్, ఎనర్జీ, వింటేజ్ మెగా మాస్

చిరంజీవి ‘శశిరేఖ’ పాట: స్టైల్, ఎనర్జీ, వింటేజ్ మెగా మాస్

 

Chiranjeevi Shashirekha song: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ సాంగ్ పాన్-ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించింది.

 

ఇప్పుడు మేకర్స్ విడుదల చేసిన రెండవ సింగిల్ ‘శశిరేఖ’ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో చిరంజీవి ఎనర్జిటిక్ స్టెప్స్, స్టైలిష్ లుక్స్, వింటేజ్ టచ్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత చాట్ స్టైల్ లిరిక్స్ ఈ పాటకు మరింత రీఫ్రెషింగ్ ఫీల్ ఇస్తున్నాయి.

 

ఈ పాటలో చిరంజీవి లుక్స్ గత చిత్రాల కంటే మరింత యంగ్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా వింటేజ్ చిరు స్టైల్‌ను అభిమానులకు గుర్తు చేసేలా రూపొందించారు. నయనతారతో కలిసి ఆయన స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌లా అనిపిస్తుంది.

 

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాటను విజువల్‌గా చాలా కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. BTS షాట్స్, మెటా రిఫరెన్స్‌లతో రూపొందిన లిరికల్ వీడియో ప్రేక్షకులకు స్పెషల్ ఫీస్ట్‌లా ఉంది. ఈ పాటకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, ఫన్నీ టచ్‌తో కూడిన వింటేజ్ మెగా వైబ్‌ను అద్భుతంగా తీసుకొచ్చారు.

 

మధుప్రియ, అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్‌తో కూడిన ఈ పాట ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ హార్ట్‌లను గెలుచుకుంటోంది. ఈ చార్ట్‌బస్టర్ సాంగ్ సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

 

ఈ చిత్రాన్ని సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Trending News