హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కోకాపేట నియోపోలిస్ దశ-3 ఇ-వేలం సోమవారం చారిత్రాత్మక రికార్డులను సృష్టించింది. ఈ వేలంలో భూమి ధరలు ఇప్పటివరకు ఉన్న రికార్డులను దాదాపు రెట్టింపు చేస్తూ ఎకరానికి ₹137 కోట్ల మార్క్‌ను చేరాయి.
5.31 ఎకరాల సరస్సు ముఖంగా ఉన్న ప్లాట్-18ను
ఎకరానికి ₹137.25 కోట్ల చారిత్రాత్మక ధరకు MSN Urban Ventures LLP కొనుగోలు చేసింది.
4.59 ఎకరాల ప్లాట్-17ను
ఎకరానికి ₹136.50 కోట్లకు Vajra Housing Projects LLP కైవసం చేసుకుంది.
2023లో జరిగిన నియోపోలిస్ వేలంలో ఎకరానికి సగటు ధర ₹73 కోట్లు మాత్రమే.
ఈసారి భూమి విలువలు 87% మేర పెరిగాయి, ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ శక్తిని మరింత బలోపేతం చేసింది.
వేలం కోసం నవంబర్ 3న నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ప్రముఖ జాతీయ, ప్రాంతీయ డెవలపర్ల నుంచి భారీ ఆసక్తి నమోదైనట్లు HMDA తెలిపింది.
నవంబర్ 17 & 20 తేదీలలో జరిగిన ప్రీ-బిడ్ మీటింగ్‌లు ప్రధాన డెవలపర్లు మధ్య పోటీనీ మరింత తీవ్రమయ్యేలా చేశాయి.
ఈ రెండు ప్లాట్ల వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వం మొత్తం
₹1,356 కోట్లు ఆర్జించింది.
ఉదయం 11 గంటలకు మొదలైన వేలం,
10 మంది ప్రముఖ బిడ్డర్ల మధ్య పోటీ కారణంగా మధ్యాహ్నం 2 గంటల గడువు దాటుతూ సాయంత్రం 4 గంటల వరకు సాగింది.
HMDA, MSTC మరియు సలహా సంస్థ Cushman & Wakefield వేలం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాయి.
ఈ బ్లాక్‌బస్టర్ ప్రారంభంతో,
నవంబర్ 28 & డిసెంబర్ 3న జరిగే నియోపోలిస్ వేలం,
డిసెంబర్ 5న జరగనున్న గోల్డెన్ మైల్ వేలం
మరింత దూకుడు బిడ్డింగ్‌ను ఆకర్షించే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ కారిడార్‌లను లక్ష్యంగా చేసుకున్న డెవలపర్లకు ఇవి కీలక అవకాశాలు కానున్నాయి.