రాంచీలో జరిగిన వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేసి భారత స్కోరును 349 వరకు తీసుకెళ్లిన కోహ్లీ, తన 52వ ODI సెంచరీని నమోదు చేశాడు. అతనితో కలిసి రెండో వికెట్‌కు రోహిత్ శర్మ 136 పరుగుల భాగస్వామ్యం చేసి భారీ టోటల్‌కు పునాది వేశారు.
కోహ్లీ సెంచరీ పూర్తి చేసిన క్షణంలోనే స్టేడియంలో సంబరాలు పుంజుకున్నాయి. అదే భావోద్వేగం డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా కనిపించింది. రోహిత్ శర్మ రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత అభిమానులు —
“కోహ్లీ సెంచరీ తర్వాత రోహిత్ ఏమన్నాడు?”
అని ఆసక్తిగా తెలుసుకోడానికి కామెంట్లు కురిపించారు.
ఈ వైరల్ చర్చపై టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సరదాగా స్పందించాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఇలా అన్నాడు:
“విరాట్ భాయ్ సెంచరీ తర్వాత రోహిత్ భాయ్ ఏమన్నారో అడుగుతూ చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే చెబుతున్నాను…
‘నీలీ పారి, లాల్ పరి, కమ్రే మే బ్యాండ్, ముజే నదియా పసంద్’ 😂”
ఈ డైలాగ్ బాలీవుడ్‌లో వైరల్ అయిన ఫన్నీ మీమ్. అర్ష్‌దీప్ ఈ పంచ్‌తో అభిమానులు నవ్వుల పూవ్వులు పూయించారు.
అసలు రోహిత్ ఏమన్నాడో మాత్రం ఇంకా సీక్రెట్ గానే ఉంచారు. కానీ ఈ హాస్య స్పందనతో మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ ఎంత లైట్ మూడ్లో ఉందో తెలుస్తోంది!